e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home News కోహ్లీ, ఊర్వశీ రౌతెలా తాగే లీటర్‌ వాటర్‌ ఖరీదు ఎంతో తెలుసా!

కోహ్లీ, ఊర్వశీ రౌతెలా తాగే లీటర్‌ వాటర్‌ ఖరీదు ఎంతో తెలుసా!

కోహ్లీ, ఊర్వశీ రౌతెలా తాగే లీటర్‌ వాటర్‌ ఖరీదు ఎంతో తెలుసా!

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ధనవంతులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు విలాసవంత జీవితాన్ని గడుపుతుంటారు. వేసుకునే బట్టల నుంచి తిరిగే కారు, తినే ఫుడ్‌ వరకు ఇలా అన్నింటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ  మార్కెట్లో లభించే అత్యుత్తమైన వాటినే ఎంచుకుంటారు. భారత్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సంపాదన, లగ్జరీ లైఫ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ముఖ్యంగా ఆరోగ్యంపై స్పెషల్‌ కేర్‌ తీసుకునే  విరాట్‌ కోహ్లీ తాగే మంచినీటి బాటిల్‌ ఖరీదు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. కోహ్లీతో పాటు బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతెలా బ్లాక్‌ వాటర్‌ను తాగుతారు. ఒక లీటర్‌ వాటర్‌ బాటిల్‌ ధర సుమారు రూ.3000-4000 ఉండొచ్చని అంటున్నారు. వీళ్లిద్దరితో పాటు పలువురు భారత సెలబ్రిటీలు కూడా  స్పెషల్‌ వాటర్‌నే తాగుతారట. 

సహజసిద్ధమైన బ్లాక్‌ ఆల్కలీన్‌ వాటర్‌ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. బ్లాక్‌ వాటర్‌లో పీహెచ్‌(pH) ఎక్కువగా ఉంటుంది. కరోనా నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు బ్లాక్‌ వాటర్‌ తాగేందుకు ఆసక్తిచూపించారు.  రోగనిరోధక శక్తిని మెరుగుపర్చడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ‘బ్లాక్ వాటర్’కు మారామని వాళ్లు చెబుతున్నారు.

Advertisement
కోహ్లీ, ఊర్వశీ రౌతెలా తాగే లీటర్‌ వాటర్‌ ఖరీదు ఎంతో తెలుసా!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement