లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు ఓ వ్యభిచార ముఠా గుట్టును రట్టుచేశారు. నోయిడా సెక్టార్ 12లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు శనివారం మధ్యాహ్నం ఆ ఇంటిపై రైడింగ్ చేశారు. ముఠాకు సంబంధించిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి చెరలో ఉన్న మహిళలను విడిపించి లక్నోలోని రెస్క్యూ హోమ్‌కు తరలించారు. సెక్టార్ 12లో తనిఖీలు నిర్వహిస్తుండగా వ్యభిచార ముఠాకు సంబంధించిన సమాచారం తెలిసిందని, ఈ ముఠాతో స్థానికంగా ఉన్న కొందరు మహిళలకు సంబంధాలు ఉన్నట్లు సమాచారం ఉందని నోయిడా అదనపు డీసీపీ రణ్‌విజయ్‌సింగ్ చెప్పారు. ఈ నెల మొదటి వారంలో కూడా నోయిడా సెక్టార్ 18లో వ్యభిచార ముఠా ఆటకట్టించి 14 మంది యువతులను విడిపించినట్లు పోలీసులు తెలిపారు.