e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home News పెండ్లి కోసం పోలీసులను ఆశ్రయించిన యువకుడు!

పెండ్లి కోసం పోలీసులను ఆశ్రయించిన యువకుడు!

లక్నో : పెండ్లి కోసం ఐదేండ్లుగా చేస్తున్న ప్రయత్నాలు వృధా కావడం, పెండ్లి చూపులకు వెళ్లి వస్తున్నా ఒక్కటీ ఖరారు కాకపోవడంతో తనకు వివాహ యోగం కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన యువకుడి ఉదంతం యూపీలో వెలుగుచూసింది. షమ్లి జిల్లా కైరానా పట్టణంలో 26 ఏండ్ల అజీం కాస్మెటిక్స్‌ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి ఐదుగురు అన్నలుండగా అందరిలోకి అజీం చిన్నవాడు. గత ఐదేండ్లుగా ఎన్నో సంబంధాలు చూసినా తన హైట్‌ కారణంగా ఏ ఒక్కటీ పెండ్లి పీటల వరకూ సాగలేదు. కేవలం రెండు అడుగుల పొడవున్న అజీం పెండ్లి ప్రయత్నాలతో విసిగి వేసారాడు. ఇక తనకు సరైన సంబంధం చూడాలని అజీం యూపీ పోలీసులను ఆశ్రయించాడు.

తనకు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదని, తనతో జీవితం పంచుకునేందుకు ఏ ఒక్కరూ సిద్ధంగా లేరా అని అజీం వాపోతున్నాడు. తొలుత యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ను తనకు పెండ్లి జరిగేలా చూడటంలో సాయపడాలని అభ్యర్ధించిన అజీం ఆపై ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు లేఖ రాశాడు, కైరానా సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ సాయాన్నీ కోరాడు. వీరందరినీ అభ్యర్ధించినా ఎలాంటి స్పందన లేకపోవడంతో అజీం యూపీ పోలీసుల తలుపు తట్టాడు. తనకు పెండ్లి కుమార్తెను చూడాలని అజీం బుధవారం తమ వద్దకు వచ్చాడని, అతడికి వీలైన సాయం చేసేందుకు ప్రయత్నిస్తామని షమ్లి పోలీస్‌ అధికారి సత్పాల్‌ సింగ్‌ చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana