e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News బ్రిటన్ 20 శాతం టీకాలను పేద దేశాలకు పంచాలి.. యూనిసెఫ్ పిలుపు

బ్రిటన్ 20 శాతం టీకాలను పేద దేశాలకు పంచాలి.. యూనిసెఫ్ పిలుపు

బ్రిటన్ 20 శాతం టీకాలను పేద దేశాలకు పంచాలి.. యూనిసెఫ్ పిలుపు

లండన్: టీకాల కోసం అలమటిస్తున్న పేదదేశాలకు బ్రిటన్ తనదగ్గరున్న కోవిడ్ టీకాల్లో 20 శాతం విరాళంగా ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి బాలల సంక్షేమ సంస్థ యూనిసెఫ్ సూచించింది. సత్వరమే.. అంటే కనీసం జూన్ మొదటివారం నాటికి వాటిని పంపించాలని పేర్కొన్నది. అయినప్పటికీ బ్రిటన్ దగ్గర జూలై చివరినాటికి తన దేశపౌరులైన వయోజనులకు ఇచ్చేందుకు సరిపడా టీకాలు ఉంటాయని ఆ సంస్థ వివరించింది. ప్రపంచంలోని 5 కోట్ల మంది ప్రజలకు టీకాలు పంపించే అదనపు సామర్థ్యం బ్రిటన్‌కు ఉందని తెలిపింది. బ్రిటన్ ఇందుకు సత్వరమే చర్యలు చేపట్టి సంపన్న జీ-7 కూటమి దేశాలకు ఆదర్శంగా నిలవాలని యూనిసెఫ్ పిలుపు ఇచ్చింది. బ్రిటన్‌ను చూసి మిగతా జీ-7 దేశాలు సైతం సాయం కోసం అలమటిస్తున్న ఇతర దేశాలకు టీకాలు పంపించే అవకాశం ఉంటుందని యూనిసెఫ్ అభిప్రాయపడింది. ఇతర దేశాల ప్రజలకు టీకాలు ఇచ్చినప్పుడే కొత్త వైరస్ రకాలు పుట్టుకురాకుండా ఉంటాయని గుర్తు చేసింది. యూనిసెఫ్ ఈ విజ్ఞప్తి చేస్తున్న సమయంలోనే ఫ్రాన్స్ తన దగ్గరున్న టీకా నిల్వల్లో 5 శాతం ఐక్యరాజ్య సమితి పేద దేశాల కోసం చేపట్టే టీకాల కార్యక్రమానికి విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించడం విశేషం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ దగ్గరున్న అదనపు టీకాలను పేద దేశాలకు పంపించేందుకు అంగీకరించారు. అమెరికా నిల్వల నుంచి 6 కోట్ల ఆస్ట్రజెనెకా డోసులను పంపుతున్నట్టు ఆయన తెలిపారు. కాకపోతే ఆ టీకాలను అమెరికా అధికారికంగా ఇంకా ఆమోదించ లేదన్న విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బ్రిటన్ 20 శాతం టీకాలను పేద దేశాలకు పంచాలి.. యూనిసెఫ్ పిలుపు

ట్రెండింగ్‌

Advertisement