లెక్కల్లో చూపని 7 కోట్ల నగదు గుర్తింపు
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: కాంగ్రెస్ రాజకీయ ప్రచారం కోసం డిజిటల్ కంటెంట్ అందిస్తున్న పలు డిజిటల్ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ కంపెనీల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు చెందిన డిజైన్‌బాక్స్డ్ క్రియేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఉంది. లెక్కల్లో చూపని రూ.7 కోట్ల నగదు, రూ.70కోట్ల విలువైన తప్పుడు ఖర్చు వివరాలను అధికారులు గుర్తించారు. కర్ణాటక సహా పలు రాష్ర్టాల్లో సోదాలు జరిగాయి. బెంగళూరు, సూరత్, చండీగఢ్, మొహాలీ ఇలా ఏడు చోట్ల సోదాలు నిర్వహించినట్టు ఐటీ అధికారులు ఆదివారం వెల్లడించారు. రూ.1.95 కోట్ల నగదు, రూ.65 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు.