చెన్నై : మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన ఇద్దరు యువకులను తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. 13 ఏండ్ల బాలిక కనిపించడం లేదని పిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మంగళవారం ఇద్దరు యువకులతో బాలిక ప్రయాణిస్తుండగా గుర్తించిన పోలీసులు వారిని ప్రశ్నించారు. బాలికను తాను ప్రేమిస్తున్నానని స్నేహితుడి సహకారంతో ఆమెను కిడ్నాప్ చేశామని ఇద్దరు యువకుల్లో ఓ వ్యక్తి వెల్లడించాడు. బాలికను గ్రామానికి తీసుకువెళ్లి గుడిలో పెండ్లి చేసుకున్నానని చెప్పాడు. బాలికను కిడ్నాప్ చేసిన యువకులను అరెస్ట్ చేసి బాధితురాలిని తల్లితండ్రుల వద్దకు పంపామని పోలీసులు తెలిపారు.