e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News GHMC Workers : మ్యాన్‌హోల్‌లోకి దిగి ఇద్దరు కార్మికులు మృతి

GHMC Workers : మ్యాన్‌హోల్‌లోకి దిగి ఇద్దరు కార్మికులు మృతి

హైదరాబాద్‌ : నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. వనస్థలిపురం పరిధిలోని సాహెబ్‌నగర్‌లో డ్రైనేజీని శుభ్రం చేసేందుకు దిగి ఇద్దరు కార్మికులు అంతయ్య, శివ అనే కార్మికులు మృతి చెందారు. అయితే, రాత్రిపూట డ్రైనేజ్ క్లీన్ చేసేందుకు అనుమతి లేదు. కాంట్రాక్టర్ బలవంతం మేరకు నలుగురు కార్మికులు మురికి కాలువలో దిగారు. ఆ ఊబిలో శివ అనే వ్యక్తి చిక్కుకుపోవడంతో కాపాడేందుకు వెళ్లిన అంతయ్య సైతం అందులోనే చిక్కుకొని ఊపిరి ఆడక మృతి చెందారు. ఇద్దరు బయట ఉండగా.. కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్‌, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మ్యాన్‌హోల్‌ మృతదేహాలను వెలికి తీశారు. మృతుడు శివకుమార్‌కు మూడేళ్ల కిందట వివాహం కాగా.. భార్య ఎనిమిది నెలల గర్భవతి. ఇంకా ఆమెకు భర్త మృతిపై కుటుంబీకులు సమాచారం ఇవ్వలేదు. అంతయ్యకు భార్య కూతురు, కొడుకు ఉన్నారు. మృతులిద్దరూ సైదాబాద్, చింతల్‌బస్తీకి చెందిన వారు కాగా.. ఆయా ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి

గేమింగ్ స్మార్ట్ ఫోన్ కొనాల‌నుకుంటున్నారా? 15 వేల లోపు బెస్ట్ బ‌డ్జెట్ ఫోన్లు ఇవే
ఇంట్లో గొడ‌వ‌ప‌డి భార‌త స‌రిహ‌ద్దుల్లోకి పాకిస్థాన్ బాలుడు..!
Tokyo Olympics : జావెలిన్‌ త్రోలో ఫైనల్స్‌కు నీరజ్‌ చోప్రా అర్హత
UAE Lifts Ban : నిషేధం ఎత్తివేసిన యూఏఈ.. అనుమతి ఎవరికంటే?
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana