రీసెంట్గా వచ్చిన బాలీవుడ్ (Bollywood) మల్టీస్టారర్ బ్రహ్మాస్త్ర (Brahmastra). అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్ బీర్ కపూర్, అలియాభట్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ కీ రోల్స్ లో నటించారు. సెప్టెంబర్ 9 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈచిత్రం మంచి కలెక్షన్లతో సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది.
ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో నిలుస్తుంది బ్రహ్మాస్త్ర. ఓ వైపు కలెక్షన్ల టాపిక్ నడుస్తుంటే..మరోవైపు సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బ్రహ్మాస్త్ర..దేవ్ (పార్టు 2) (Brahmastra 2)లో మరికొంతమంది స్టార్ సెలబ్రిటీలు కనిపించబోతున్నారని ఇప్పటికే అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా మరో వార్త హల్ చల్ చేస్తోంది.
ఈ చిత్రంలో స్టార్ హీరో హృతిక్ రోషన్ కీ రోల్లో కనిపించబోతున్నాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉందని ఇన్ సైడ్ టాక్. అంతేకాదు కరణ్ జోహార్ మరో టాలీవుడ్ స్టార్ హీరోను కూడా సంప్రదించాడన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ ప్రాంఛైజీలో భాగస్వామ్యం కాబోతుండగా..ఆ తెలుగు స్టార్ హీరో ఎవరనేది జక్కన్ననే నిర్ణయిస్తాడని తెలుస్తోండగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
అయాన్ ముఖర్జీ రెండో ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నాడని, త్వరలోనే బ్రహ్మాస్త్ర: పార్టు 2 : దేవ్ షూటింగ్ అప్డేట్ కూడా రానుందని తెలుస్తోంది. హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర చిత్రం మూడు పార్టులుగా తెరకెక్కనుంది. బహ్మాస్త్ర చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా తెరకెక్కించారు.