నోయిడా : గే డేటింగ్ యాప్ వేదికగా పలువురిని మోసగించిన ఇద్దరు వ్యక్తులను నోయిడా పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. గే డేటింగ్ యాప్‌లో స్నేహం నటించే వీరు తమకు పరిచయమైన వారిని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి అందినంత దోచుకుని ఉడాయించేవారు. పోలీసులకు సమాచారం అందడంతో నిందితులు అమిత్, దీపాన్షులను నోయిడా సెక్టార్ 58లో పట్టుకున్నారు. జైపురియ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వద్ద నెంబర్ప్లేట్లేని బైక్‌పై వెళుతున్న నిందితులను పోలీసులు అడ్డగించగా కాల్పులకు తెగబడి పారిపోయేందుకు ప్రయత్నించారు.
పోలీసులు జరిపిన కాల్పుల్లో దీపాన్షుకు బుల్లెట్ గాయమైంది. ఆపై దీపాన్షుతో పాటు అమిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ నోయిడాలోని బదల్పూర్ ప్రాంతానికి చెందిన నిందితులు గే డేటింగ్ యాప్ బ్లూడ్ యాప్‌పై బాధితులను ఆకట్టుకుని వారిని లూటీ చేయడం పనిగా పెట్టుకున్నారు. స్నాచింగ్, చోరీ వంటి నేరాల్లోనూ వీరికి ప్రమేయం ఉన్నట్టు వెల్లడైంది. వీరి నుంచి చోరీ సొత్తు, బైక్, తొమ్మిది మొబైల్ ఫోన్లు, ఓ నాటుతుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.