TVS Jupiter Classic | టూ వీలర్స్ మేజర్ టీవీఎస్ మోటార్స్ పాపులర్ స్కూటర్ జ్యూపిటర్ సెలబ్రిటీ వర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి 50 లక్షల స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం టీవీఎస్ మోటార్స్.. న్యూ టీవీఎస్ జ్యూపిటర్ క్లాసిక్ ఆవిష్కరించింది.
టీవీఎస్ జూపిటర్ పట్ల లక్షల మంది కస్టమర్లు చూపిన ప్రేమ, విశ్వాసం అసాధారణమైందని టీవీఎస్ మోటార్స్ (మార్కెటింగ్) కమ్యూటర్స్, కార్పొరేట్ బ్రాండ్ అండ్ డీలర్ ట్రాన్స్‌ఫోర్టేషన్ అనిరుద్ధ హాల్దర్ చెప్పారు. దీనికి గుర్తుగా జ్యూపిటర్ క్లాసిక్‌ను ఆవిష్కరించామని అన్నారు.
జ్యూపిటర్ క్లాసిక్ స్కూటర్లో డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌తోపాటు డిస్క్ బ్రేక్‌లు, ఇంజిన్ కిల్ స్విచ్, యూఎస్బీ చార్జర్ తదితర కొత్త ఫీచర్లు జత కలిశాయి. రీగల్ పర్పుల్, మైస్టిక్ గ్రే రంగుల్లో ఇది లభిస్తుంది. 110 సీసీ సామర్థ్యంతో కూడిన ఇంజిన్, ఎకొనోమీటర్ వంటి ఫీచర్లు జత చేశారు. ప్రస్తుతం జ్యూపిటర్ క్లాసిక్ స్కూటర్‌ను రూ.85,866లకు బుక్ చేసుకోవచ్చు.