హైదరాబాద్ : అటవీశాఖలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(ఎఫ్‌బీవో) పోస్టుల నియామకం కోసం శారీరక పరీక్ష/వాకింగ్ పరీక్ష కోసం షార్ట్‌లిస్ట్ చేసిన ఐదవ దశ అభ్యర్థుల జాబితాను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం ప్రకటించింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో హాజరుకాని వారి స్థానంలో, గత ఫలితాల్లో అర్హతలేని అభ్యర్థులను విడిచిపెట్టి ఐదవ దశ కోసం కమిషన్ షార్ట్ లిస్ట్ చేసింది.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మేడిపల్లి, శాంతివనం పార్క్‌లో ఏప్రిల్ 6న ఉదయం 6 గంటలకు అర్హులైన అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు ఉదయం 5.15 గంటలకే హాల్ టికెట్, ధ్రువీకరించిన ఏదైనా గుర్తింపు పత్రంతో పాటు అవసరమైన సర్టిఫికెట్లతో హాజరు కావాలంది. కాటన్ దుస్తులు, షూలు, క్యాప్ తప్పనిసరని పేర్కొంది. మెడికల్, ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించినవారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.tspsc.gov.in. ను సందర్శించాల్సిందిగా సూచించింది.