పల్లవి: గులాబీ జెండా కేసీఆర్..
గులాబీ జెండా కేసీఆర్..
చరణం: నిన్న గులాబీ జెండా.. నేడు గులాబీ జెండా..
పల్లవి: నిన్న గులాబీ జెండా.. నేడు గులాబీ జెండా..
తెలంగాణలో రేపు కూడా ఎగిరేది గులాబీ జెండా..
సకల జనులకు అండా..
నిన్న చూడు కేసీఆర్..
నేడు చూడు కేసీఆర్.. తెలంగాణలో… ఓ…
తెలంగాణలో రేపు కూడా కాబోయే నేత మన కేసీఆర్..
రాష్ట్ర జాతిపిత మన కేసీఆర్.. ॥నిన్న॥
చరణం: ఉద్యమాన సబ్బండ జాతిని ఏకతాటిపై నడిపింది..
జాతీయ ప్రతిపక్ష నేతలకు విడమరచి మెప్పించింది..
కోరస్ : విడమరచి మెప్పించింది
కరుడు గట్టిన నాటి ఢిల్లీ మెడ వంచి రాష్ర్టాన్ని తెచ్చింది
కోరస్: మెడవంచి రాష్ర్టాన్ని తెచ్చింది..
గులాబీ జెండా.. కేసీఆర్…
వెయ్యేల్ల తరువాత అయిన తెలంగాణను తెచ్చింది..
కాళేశ్వరాన్ని కట్టింది.. ఎవ్వరని అడిగారనుకో పలికే పేరు మన కేసీఆర్
కోరస్: పలికే పేరు మన కేసీఆర్
వందలేల్ల తరువాతైనా యాదాద్రిని నిర్మించింది..
ఎవ్వరంటే ఒక చరిత్రగా నిలిచే పేరు మన కేసీఆర్
గులాబీ జెండా.. కేసీఆర్.. ॥నిన్న॥
చరణం: అరరరె.. తెలంగాణ ఇంటింటికీ నల్లా తాగునీళ్లను ఇచ్చింది
హే.. తెలంగాణ ఊరూరు చెరువులు సాగునీటితో నింపింది
కోరస్: సాగు నీటితో నింపింది
24 గంటలు ఫ్రీగా కరెంట్ రైతులకు ఇచ్చింది.
కోరస్: కరెంట్ రైతులకు ఇచ్చింది.
ఎడారి బీళ్లను దేశంలోనే అన్నపూర్ణలుగా మార్చింది…
ఉరితాడే దిక్కైన రైతులకు రైతుబంధుగా నిలిచింది..
కన్ను మూసిన రైతుల కుటుంబ ధీమా బీమాగా వెలిసింది
కోరస్: ధీమా బీమాగా వెలిసింది
తెలంగాణ నిరుపేదల పాలిట దళితబంధుగా మారింది
కోరస్: దళితబంధుగా మారింది
కూతలు కూసి కోతలు కోసే నేతలకు మా సవాల్ ఇదే..
గులాబీ జెండా.. కేసీఆర్.. ॥నిన్న॥
చరణం: తెలంగాణలో ఒంటరి మహిళలకు ఆసరాగా తోడయ్యింది..
తెలంగాణలో వధువులకు కల్యాణ చెక్కులందించింది..
షాదీ ముబారక్ చెప్పింది..
కోరస్: కల్యాణ చెక్కులందించింది.. షాదీ ముబారక్ చెప్పింది…
తెలంగాణలో బాలింతలకు కేసీఆర్ కిట్టు ఇచ్చింది..
బరువు బతుకులా..
బరువు బతుకులా.. చేనేతల జీవితాలనే మార్చింది..
తెలంగాణలో ఐటీ రంగాన్ని ప్రపంచస్థాయికి తెచ్చింది..
గులాబీ జెండా కేటీఆర్..
గులాబీ జెండా కేటీఆర్..
అరరరే.. ఎవరేమన్న..ఏదేమైనా.. అరె ఎవరేమన్న.. ఏదేమైనా..
తెలంగాణను నిజంగా బంగారు తెలంగాణగా నిలిపేది..
కోరస్: గులాబీ జెండా కేసీఆర్.. ॥నిన్న॥
(టీఆర్ఎస్ 20వ ప్లీనరీ సందర్భంగా ప్రముఖ కవి సుద్దాల అశోక్‌తేజ తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని పాటగా రాశారు. కర్నాటి విద్యాసాగర్ సమర్పణలో యశోకృష్ణ సంగీతం అందించగా ధనుంజయ్ ఆలపించిన ఈ పాటను మంత్రి కేటీఆర్ శనివారం తెలంగాణ భవన్లో ఆవిష్కరించారు.)
–సుద్దాల అశోక్‌తేజ