సౌత్ ఆఫ్రికా : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ తరఫున ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గుర్రాల నాగరాజు (సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు ) ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ప్రచారంలో టీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా ఎన్నారై శాఖ తరఫున ప్రత్యక్షంగా శివ కుమార్ యాదవ్ కట్టబోయిన (పెద్దవూర మండలం ) అధ్వర్యంలో ప్రచారం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ప్రచారంలో భాగంగా పెద్దవూర మండలంలో అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాల్ని ప్రచారం చేయనున్నట్లు శివ కట్టబోయిన పేర్కొన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారనే విశ్వాసం ఉందన్నారు.