తెలంగాణలో గూడు లేనివారు ఉండకూడదన్న కేసీఆర్ ఆశయం మేరకు డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నిరుపేదలు, గూడు లేనివారు, ఇరుకిరుకు ఇండ్లల్లో నివాసముంటూ పడరాని పాట్లు పడిన వారు ఇప్పుడు దర్జాగా ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లల్లో సుఖపడుతున్నారు.