e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News ట్రై బల్‌.. చేశారా?

ట్రై బల్‌.. చేశారా?

ముత్యాలు, పగడాలు, గవ్వలు, పూసలు, రంగురాళ్ళు.. ఒకటేమిటి, ప్రకృతిలోని ప్రతి అద్భుతాన్నీ గిరిజనులు కొప్పులో తురుముతారు. ముక్కుకు గుచ్చుకుంటారు. నడుముకు చుట్టుకుంటారు. చెవులకు వేలాడదీసుకుంటారు. చేతులకు ముస్తాబు చేసుకుంటారు. అందులో ఆర్భాటం ఉండదు. కృత్రిమత్వం కనిపించదు.  గిరిజన ఫ్యాషన్లు సహజత్వానికి అతి దగ్గరగా ఉంటాయి. ఈ ఒక్క కారణంతోనే..  ఆదివాసీ నగలు మెట్రోలకు విస్తరించాయి,  ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి. 

ట్రై బల్‌.. చేశారా?

ఈ తరం

అమ్మాయిల అభిరుచికి తగ్గట్టు, బంగారు నగలకు దీటుగా ‘ట్రైబల్‌ జువెలరీ’ పేరుతో రకరకాల పూసలు, రాళ్లకు యాంటిక్‌ సొగసుల్ని అద్దేస్తున్నారు డిజైనర్లు. పైగా ఈ నగలు బంగారం, వెండి ఆభరణాల్లా నల్లబడే ఆస్కారం లేదు. ఎన్నేండ్లయినా ఆ మెరుపులకు ఢోకా ఉండదు. నల్లబడతాయన్న భయమే లేదు. పైగా, ఈ నగల్లోనూ కెంపులూ, పచ్చలూ, నీలాలూ, పగడాలూ, ముత్యాలూ, అన్‌కట్‌ డైమండ్లూ పొదుగుతున్నారు. టెంపుల్‌, నక్షీ, కుందన్‌, పోల్కీ, మీనాకారి.. తదితర సంప్రదాయ డిజైన్లతోనూ జోడిస్తున్నారు. అందుకేనేమో  నెక్లెస్‌లు, హారాలు, పెండెంట్లు, గాజులు, కడియాలు.. ఇలా ప్రతి నగా గిరిజన సౌందర్యంతో వగలుబోతున్నది. అడవి మల్లెను తలపించే సహజ సౌందర్యాన్ని అర్బన్‌ అమ్మాయిలకు కానుకగా ఇస్తున్నది. 

గిరిజన

 ప్రాంతాల్లో వెండి నగల వాడకం ఎక్కువ. చేతులకూ కాళ్లకూ వెండి కడియాలే పెట్టుకుంటారు.  వెండి లోలాకులు, కంటెలు, గొలుసులు విరివిగా ధరిస్తారు. ఒక్కో పండక్కీ ఒక్కో రకమైన నగతో ముస్తాబవుతారు. ఆ అలంకరణా వైవిధ్యంగా ఉంటుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొనే పాతకొత్తల మేలు కలయికగా సరికొత్త డిజైన్లను సృష్టిస్తున్నారు ఫ్యాషన్‌ సైంటిస్టులు.  

ట్రై బల్‌.. చేశారా?

బంగారం

ధర కొండెక్కుతున్నది. పైగా భద్రత లేదు. చైన్‌ స్నాచర్ల నుంచి చెడ్డీ గ్యాంగుల వరకూ.. చోరుల కండ్లన్నీ కాంచనం మీదే! అందంలో, అలంకరణలో బంగారానికి తీసిపోని ట్రైబల్‌ జువెలరీని కొంటే, ఆ భయమే ఉండదు. దుస్తులకు తగ్గ నగల సెట్స్‌ను సిద్ధం చేసుకోవచ్చు. 

అమెరికన్‌ 

డైమండ్లూ, జిర్కాన్‌ రాళ్లూ పొదిగిన స్టెర్లింగ్‌ నగలైతే బంగారాన్నే మరిపించేంత అందంగా, స్టయిలిష్‌గా ఉంటాయి. కొందరి ఒంటికి బంగారం పడకపోవచ్చు. దద్దుర్లు రావచ్చు. కానీ, వీటితో ఆ ఇబ్బంది లేదు. కాబట్టే, రకరకాల పూసలనగల్ని అలంకరించుకుని ముచ్చట తీర్చుకుంటున్నారు 

ఆధునిక మహిళలు.

ట్రైబల్‌

జువెలరీ సెలెబ్రిటీలను కూడా ఆకర్షిస్తున్నది. బాలీవుడ్‌, టాలీవుడ్‌ తారలంతా పార్టీలూ వేడుకల్లో పెద్దపెద్ద పూసలు, లాకెట్లు ఉన్న నగలను ధరిస్తుండటంతో,  జనంలోకి అవి చొచ్చుకుపోయాయి. ఫ్యాషన్‌ వీక్స్‌ ద్వారా కూడా మోడల్స్‌ విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. పెండ్లిళ్లలో మెహందీ, సంగీత్‌ వంటి వేడుకల కోసం ఈ నగలనే కొంటున్నారు. ట్రైబల్‌ డిజైన్లను అనుకరిస్తూ బంగారం, వెండి కలగలిపిన డిజైన్లలో వస్తున్న నగలు కూడా అతివల్ని ఆకర్షిస్తున్నాయి. గవ్వలు, పగడాలతో రూపొందించిన గొలుసులు హుందాగా మగువల మనసును దోచేస్తున్నాయి. 

ట్రై బల్‌.. చేశారా?
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ట్రై బల్‌.. చేశారా?

ట్రెండింగ్‌

Advertisement