కాసిపేట : గర్భిణిగా ( Pregenecy ) ఉన్న ఆ తల్లి ఎంతో ఆశతో తనకు మరో రెండు నెలల్లో కూతురో, కుమారుడో పుడుతారని ఆనందంతో ఉన్న సమయంలో ఆమె కల నెరవేరకుండా బిడ్డకు జన్మనిచ్చి తనువు చాలించింది. కొద్ది నిమిషాల్లోనే మగ శిశువు మృతి చెందడం కుటుంబంలో తీరని విషాదం (Tragedy) నింపింది.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం( Kasipet) సామగూడకు గ్రామానికి చెందిన ముప్నై ఏండ్ల కుడిమేత అనురాధ ( Anuradha ) సోనాపూర్ అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తుంది. ఆమెకు తొమ్మిది ఏళ్ల క్రితం సోనాపూర్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ లక్ష్మణ్‌తో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్త సీఆర్పీఎఫ్ జవాన్ కావడంతో విధులకు వెళ్లడంతో సామగూడలోని ఆమె తల్లి ఇంట్లో ఉంటుంది.
ఏడు నెలల గర్భవతైన అనురాధకు బుధవారం తెల్లవారుజామున అనారోగ్య సమస్య తలెత్తడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యం అందిస్తుండగా ఫిట్స్ రావడంతో పాటు రక్తం తక్కువగా ఉండడంతో పరిస్థితి విషమంగా మారింది.
ఈ సమయంలో వైద్యులు వైద్యం అందించి కడుపులోని మగ శిశువును బయటకు తీశారు. అనంతరం అనురాధ మృతి చెందగా, కొద్ది సేపటికే శిశువు సైతం మృతి చెందడంతో కుటుంబంలో విషాధచాయలు నెలకొన్నాయి.