e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News లాల్‌ దర్వాజ బోనాలు.. పాతబస్తీలో ట్రాఫిక్‌ ఆంక్షలు

లాల్‌ దర్వాజ బోనాలు.. పాతబస్తీలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సిటీబ్యూరో : పాతబస్తీలో లాల్‌ దర్వాజ బోనాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నగర సీపీ అంజనీకుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. పాతబస్తీలో ఆదివారం బోనాలు, సోమవారం ఘటాల ఉరేగింపు ఉంది. దీంతో సోమవారం బోనాల జాతరకు సంబంధించిన ర్యాలీ పాతబస్తీలో కొనసాగనుంది.ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఈ ఉత్తర్వులు చార్మినార్‌, మీర్‌చౌక్‌, ఫలక్‌నుమా, బహదూర్‌పుర ప్రాంతాల్లో అమలులో ఉంటాయి. ఆర్టీసీ బస్సులు చార్మినార్‌, ఫలక్‌నుమా, నయాపూల్‌ వైపు అనుమతించరు, సీబీఎస్‌, అఫ్జల్‌గంజ్‌, దారుల్‌షిఫా ఎక్స్‌ రోడ్‌, ఇంజన్‌బౌలి రూట్లలో వెళ్లాలని సీపీ సూచించారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు.. మళ్లింపు

 • రాజన్న బౌలీ నుంచి లాల్‌ దర్వాజ ఆలయం వెళ్లే వాహనాలను పతీర్‌ కి దర్గా లాన్‌ నుంచి రామస్వామి గంజ్‌ వైపు మళ్లిస్తారు.
  కందికల్‌ గేట్‌ నుంచి లాల్‌దర్వాజ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఓల్డ్‌ ఛత్రినాక పీఎస్‌ ‘వై’ జంక్షన్‌ నుంచి గౌలిపుర వైపు మళ్లిస్తారు.
 • బాలాగంజ్‌ నుంచి లాల్‌దర్వాజ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ రూట్‌ వాహనాలను లక్ష్మీదేవీ పాన్‌ షాప్‌ నుంచి నాగులచింత జంక్షన్‌ వైపు మళ్లిస్తున్నారు.
 • ఉప్పుగూడ, ఛత్రినాక నుంచి వచ్చే వాహనాలను షుకూర్‌ మాస్క్‌ వైపు అనుమతించరు, ఈ వాహనాలను మొఘల్‌పుర పోలీస్‌స్టేషన్‌ వైపు మళ్లిస్తారు.
 • మీర్‌ కా డేరా, మొగల్‌పుర వైపు నుంచి వెళ్లే వాహనాలను హరిబౌలి క్రాస్‌రోడ్స్‌ వైపు అనుమతించరు, ఈ వాహనాలను వాటర్‌ ట్యాంకు వైపు మళ్లిస్తున్నారు.
 • అస్ర దవాఖాన, మొఘల్‌పుర వాటర్‌ ట్యాంకు వైపు నుంచి చార్మినార్‌ మెయిన్‌ రోడ్డు వైపు ట్రాఫిక్‌ అనుమతించరు, ఈ రూట్‌లోని వాహనాలను బీబీ బజార్‌ వైపు మళ్లిస్తారు.
 • భవానీనగర్‌, మిర్జాలం తాలబ్‌ వైపు నుంచి చార్మినార్‌ వెళ్లే వాహనాలను అనుమతించరు, ఈ వాహనాలను బీబీ బజార్‌ క్రాస్‌ రోడ్డు వద్ద అలీజా కోట్ల వైపు(మిరాలం మండి రోడ్డు) దారి మళ్లిస్తారు.
 • యాకత్‌పుర నుంచి గుల్జార్‌హౌస్‌కు వెళ్లే వాహనాలను మీరాలంమండి రోడ్డులోకి ఇతేబార్‌ చౌక్‌ నుంచి మిరాలం మండి, అల్జాకోట్ల వైపు వైపు దారి మళ్లిస్తున్నారు.
 • పురానాహవేలి, మండి రోడ్‌ నుంచి చెత్త బజార్‌కు వచ్చే ట్రాఫిక్‌ను లక్కడ్‌ కోటీ చౌరస్తా వద్ద దారుల్‌ షిఫా వైపు మళ్లిస్తున్నారు.
 • చాదర్‌ఘాట్‌, నూర్‌ఖాన్‌ బజార్‌, దారుల్‌ షిఫా నుంచి నయాపూల్‌ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు, ఈ వాహనాలను ఎస్‌జే రోటరీ నుంచి పురానా హవేలి, శివాజీ బ్రిడ్జి, చాదర్‌ఘాట్‌ వైపు మళ్లిస్తారు.
 • ఫతే దర్వాజ నుంచి వచ్చే వాహనాలను హిమ్మత్‌పుర ఎక్స్‌ రోడ్డువైపు అనుమతించరు, హోల్గ హోటల్‌ వద్ద ఖిల్వత్‌ వైపు మళ్లిస్తున్నారు.
 • ఖిల్వత్‌ నుంచి లాడ్‌ బజార్‌ వెళ్లే వాహనాలు మోతీగల్లి టీ జంక్షన్‌ వద్ద చౌక్‌ మాస్క్‌ వైపు దారి మళ్లిస్తారు.
 • బండి కీ అడ్డా, ఝాన్సీబజార్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను గుల్జార్‌ హౌస్‌వైపు అనుమతించరు, మిట్టీ కె షేర్‌ వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.
 • పురానాపూల్‌, గుడ్‌ విల్‌ హోటల్‌, మూసాబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలను నయాపూల్‌ వైపు అనుమతించరు, ముస్లీంజంగ్‌ బ్రిడ్జి వద్ద మళ్లిస్తున్నారు.
 • గౌలిగూడ, సిద్దిఅంబర్‌ నుంచి నయాపూల్‌ వైపు వచ్చే వాహనాలను అఫ్జల్‌గంజ్‌ చౌరస్తా నుంచి ముస్లీంజంగ్‌ బ్రిడ్జ్‌ ఉస్మానియా దవాఖాన రోడ్డు వైపు మళ్లిస్తున్నారు.
 • మదీన ఎక్స్‌ రోడ్స్‌, ఇంజన్‌బౌలి, జహనుమా రోడ్లు మూసివేస్తారు. ఎలాంటి వాహనాలను అనుమతించరు.

పార్కింగ్‌ స్థలాలు..

 • అలియాబాద్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను పోస్టాఫీస్‌కు ఎదురుగా, శాలిబండ వద్ద సింగిల్‌ లైన్‌, అల్కా థియేటర్‌ బహిరంగ ప్రదేశంలో పార్కు చేయాలి.
 • హరిబౌలి నుంచి వచ్చే వాహనాలను ఆర్యా మైదాన్‌, సుధా థియేటర్‌ లేన్‌, అల్క థియేటర్‌ ఓపెన్‌ ప్లేస్‌.
 • ఛత్రినాక ఓల్డ్‌ పీఎస్‌ వైపునుంచి వచ్చే వాహనాలను వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం, లక్ష్మీనగర్‌, సరస్వతి విద్యానికేతన్‌, – ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, ఫలక్‌నుమా, పత్తర్‌ కి దర్గా సమీపంలో పార్కు చేయాలి.
 • మూసాబౌలి, మీర్‌చౌక్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను చార్మినార్‌ బస్‌ టర్మినల్‌లో పార్కు చేయాలి.

అంబర్‌పేట్‌లోనూ వాహనాల దారి మళ్లింపు..

అంబర్‌పేట్‌లోని మహంకాళి ఆలయం వద్ద జరిగే బోనాల సందర్భంగా అంబర్‌పేట్‌ పరిసర ప్రాంతాల్లో ఆదివారం, సోమవారం ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సోమవారం మధ్యాహ్నం 3 నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున 3 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. ఈ సందర్భంగా వరంగల్‌, పరిసర ప్రాంతాల నుంచి వచ్చే అంబర్‌పేట్‌ వైపు వచ్చే జిల్లా బస్సులను దారి మళ్లిస్తారు. వరంగల్‌, తదితర ప్రాంతాల వైపు నుంచి ఉప్పల్‌మీదుగా అంబర్‌పేట్‌ వైపునకు వచ్చే వాహనాలు, తార్నాక, అడిక్‌మెట్‌, విద్యానగర్‌, ఫీవర్‌ ఆసుపత్రి, టూరిస్ట్‌ హోటల్‌, నింబోలి అడ్డ, చాదర్‌ఘాట్‌, సీబీఎస్‌ వైపు మళ్లిస్తారు. తిరిగి వెళ్లే వాహనాలు కూడా అదే రూట్‌లో వెళ్లాలి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana