దేశముదురు చిత్రంతో చిన్న వయస్సులోనే స్టార్డమ్ తెచ్చుకుంది ముంబై చిన్నది హన్సికామోత్వానీ. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ కోట్లలో ఫాలోవర్లను సంపాదించుకుందీ బ్యూటీ. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అప్డేట్స్ షేర్ చేసుకునే హన్సికా స్టైలిష్ క్వీన్ అవతారమెత్తింది. బొహొ-చిక్ ఔట్ఫిట్లో తళుక్కుమంటోంది. బైట్ క్రాప్ టాప్ అండ్ ఫ్లోవీ ప్యాంట్స్ తో చక్‌చక్ మని మెరుస్తున్న నెక్లెస్‌ను మెడలో వేసుకుని గార్జియస్ లుక్‌లో మెరిసిపోయింది హన్సిక.
సమ్మర్ లో ధరించేందుకు అనువుగా ఉన్న వైట్ డ్రెస్‌లో ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందీ హన్సిక. కర్లీ లాంగ్ హెయిర్‌తో మంత్రముగ్దులను చేసే అందంతో తెల్ల దుస్తుల్లో హన్సికా దిగిన స్టిల్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.