Anushka Shetty Next Film | విభిన్న కథలను ఎంచుకుంటూ వైవిధ్య భరిత పాత్రల్లో నటిస్తూ దక్షిణాదిన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనుష్క శెట్టి. ‘సూపర్’ సినిమాతో ఇండస్ట్రీలోకి పరిచయమైన ఈ అమ్మడు అనతికాలంలోనే అగ్ర కథానాయికగా స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. దశాబ్ధ కాలం పాటు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగింది. అయితే అనుష్క ఈ మధ్య సినిమాల జోరు తగ్గించింది. 2020లో వచ్చిన ‘నిశ్శబ్ధం’ తర్వాత ఇప్పటివరకు ఈమె నుండి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఈమె నవీన్ పొలిశెట్టి హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా సెట్స్‌పైన ఉండగానే అనుష్క మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అనుష్క తాజాగా మరో సినిమాకు సైన్ చేసిందట. ప్రముఖ దర్శకుడు, అమలా పాల్ మాజీ భర్త ఏ.ఎల్ విజయ్‌తో స్వీటీ తన తదుపరి సినిమాను చేయబోతుందట. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయిని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా బహుభాషా చిత్రంగా తెరకెక్కనుందట. ఇక ఈ చిత్రాన్ని కూడా యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్నట్లు టాక్. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అనుష్క ప్రస్తుతం మలయాళంలో సురేశ్ గోపి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఒట్టక్కొంబన్లో కీలకపాత్ర పోషిస్తుంది.