Thankyou Movie Second Single | అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అక్కినేని నాగచైతన్య. ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి వరుస హిట్లతో జోరుమీదున్న చైతన్య హ్యట్రిక్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన నటించిన ‘థాంక్యూ’ విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 8న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ను ప్రకటించారు.
ఈ చిత్రంలోని ‘ఏంటో ఏంటోంటో’ అంటూ సాగే మెలోడియస్ సాంగ్‌ను గురువారం సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను జోనిత గాంధి ఆలపించింది. ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన ‘మారో మారో’ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీ.సీ శ్రీరామ్ ఛాయగ్రహకుడిగా పనిచేశాడు. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు.
A Breezy melody #EntoEnteynto from #ThankYouTheMovie today @ 5PM ❤️😍@chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @jonitamusic @IananthaSriram @pcsreeram @BvsRavi #MalavikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic pic.twitter.com/9Tn6IjnURE
— Sri Venkateswara Creations (@SVC_official) June 16, 2022