e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, April 11, 2021
Advertisement
Home News తృణ‌మూల్‌కు గుడ్‌బై చెప్పిన మ‌రో నేత

తృణ‌మూల్‌కు గుడ్‌బై చెప్పిన మ‌రో నేత

తృణ‌మూల్‌కు గుడ్‌బై చెప్పిన మ‌రో నేత

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి మ‌రో నేత గుడ్‌బై చెప్పారు. అసెంబ్లీ ఎన్నిక‌ల తొలి విడుత పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు టీఎంసీ నేత, మాజీ ఎమ్మెల్యే దినేశ్ బ‌జాజ్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేర‌కు ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి, టీఎంసీ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జికి వ్య‌క్తిగ‌త మెసేజ్ పంపించారు. ఇన్నాళ్లుగా పార్టీలో త‌నకు స్థానం క‌ల్పించినందుకు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కాగా, దినేశ్ బ‌జాజ్ 2006లో ఎమ్మెల్యేగా గెలిచి 2011 వ‌ర‌కు ఆ ప‌ద‌విలో ఉన్నారు.  

ఇక తృణ‌మూల్‌కు రాజీనామా చేసిన దినేశ్ బ‌జాజ్‌ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. త్వ‌ర‌లో తాను బీజేపీలో చేరుతాన‌ని, బీజేపీ గ‌నుక త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే క‌చ్చితంగా గెలిచి చూపిస్తాన‌ని ఆయ‌న చెప్పారు. బీజేపీ టికెట్ ఇచ్చినా, ఇవ్వ‌క‌పోయినా తాను టీఎంసీలో ఉండ‌కూద‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని, అందుకే రాజీనామా చేశాన‌ని పేర్కొన్నారు. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో హిందీ మాట్లాడేవారిని బ‌య‌టి వ్య‌క్తులుగా చిత్రీక‌రిస్తున్నార‌ని, అది క‌రెక్టు కాద‌ని వ్యాఖ్యానించారు.   ‌  

Advertisement
తృణ‌మూల్‌కు గుడ్‌బై చెప్పిన మ‌రో నేత

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement