యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff). ఈ కండల వీరుడు ధడక్ ఫేం శశాంక్ కైతాన్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. కాగా ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక (Rashmika Mandanna)కీ రోల్ చేస్తుంది. ఈ క్రేజీ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేశారన్న వార్త ఒకటి బీటౌన్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
తాజా అప్డేట్ ప్రకారం ఈ మూవీకి స్క్రూ ఢీలా (Screw Dheela) అనే టైటిల్‌ను ఫైనల్ చేశారట. అయితే దీనిపై మేకర్స్ కానీ, యాక్టర్లు కానీ ఎక్కడా ప్రస్తావించడం లేదు. టైటిల్ పై అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ రానుంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు టీం.
2023 ప్రథమార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు టాక్. రష్మిక ప్రస్తుతం రణ్‌బీర్‌తో చేస్తున్న యానిమల్ షూటింగ్లో ఉంది. దీంతోపాటు రష్మిక తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. టైగర్ ష్రాఫ్ మరోవైపు యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న గనపథ్ చిత్రంలో నటిస్తున్నాడు.