Tina Dabi | యూపీఎస్సీ టాపర్, ఐఏఎస్ టీనా దాబీ మాజీ భర్త, ఐఏఎస్ అథర్ అమీర్ మరోసారి పెళ్లి పీటలెక్కాడు. డాక్టర్ మెహ్రీన్ ఖాజీని ఆదివారం పెళ్లాడాడు. నవ దంపతుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐఏఎస్‌లు టీనా దాబీ, అథర్ అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో 2021లో విడాకులు తీసుకున్నారు.
టీనా ఈ ఏడాది ఏప్రిల్ 20న మరో ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాండేను పెళ్లి చేసుకున్నది. తాజాగా అథర్ సైతం రెండో పెళ్లి చేసుకున్నాడు. అథర్ – మెహ్రీన్ ఖాజీల వివాహం ఆదివారం జరగ్గా.. పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నూతన దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెహ్రీన్ ఖాజీ జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ నివాసి. ఆమె వృత్తిరీత్యా డాక్టర్. ప్రస్తుతం ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్లో సైంటిఫిక్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన టీనా దాబీ 2015 సంవత్సరంలో యూపీఎస్సీలో ఫలితాల్లో మొదటిస్థానంలో నిలువగా.. అథర్ అమీర్ రెండోస్థానంలో నిలిచాడు. వీరిద్దరు 2018 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరు 2015లో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కార్యాలయంలో ఇద్దరు కలుసుకున్నారు. ఇక్కడే తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2018, ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. ఇద్దరిదీ మతాంతర వివాహం కావడంతో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ జంట పెళ్లికి అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. పెళ్లయిన కొద్దిరోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. 2021లో విడాకులు తీసుకున్నారు.