ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సపోర్టింగ్ రోల్స్ తో కెరీర్ ను మొదలుపెట్టాడు. ప్రస్తుతం డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు కొత్తదనంతో కూడిన కథలు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకీ ఆ యువ హీరో ఎవరో..? అర్థమయే ఉంటుంది. త్వరలో గాలి సంపత్తో అలరించేందుకు సిద్దమవుతున్న శ్రీవిష్ణు. ఈ యువ హీరో వెంకటేశ్‌కు వీరాభిమాని.
తాజాగా ఓ టీవీ టాక్ షోలో ఈ విషయాన్ని శ్రీవిష్ణు మాట్లాడుతూ..తాను ఎక్కువసార్లు చూసిన సినిమా నువ్వు నాకు నచ్చావ్ అని చెప్పాడు. వెంకీ కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ చిత్రాన్ని 72 సార్లు చూసినట్టు చెప్పుకొచ్చాడు.శ్రీవిష్ణుకు వెంకీ రోల్ మోడల్ అని చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు. అనీష్ డైరెక్ట్ చేసిన గాలి సంపత్ లో రాజేంద్రప్రసాద్ టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాతో డైరెక్టర్ అనిల్ రావిపూడి నిర్మాతగా కూడా మారాడు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.