లాక్డౌన్ కాలంలో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ముందు వరుసలో ఉన్న యాక్టర్ సత్యదేవ్. కరోనా కాలంలో ఈ యువ హీరో నటించిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ఓటీటీలో విడుదలై మంచి విజయం అందుకుంది. సత్యదేవ్ ప్రస్తుతం 7 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఏప్రిల్ 2022 వరకు కాల్షీట్లు దొరకడం కష్టమే. కంటెంట్ ఆధారిత సినిమాపైనే తన ఫోకస్ అంతా పెట్టాడు సత్యదేవ్. బాలీవుడ్ స్టార్ సినిమాలో కీ రోల్ పోషిస్తున్నాడు.
సత్యదేవ్ నటిస్తున్న తిమ్మరుసు షూటింగ్ పూర్తయింది. మరోవైపు తమన్నాతో కలిసి గుర్తుందా శీతాకాలం, నిత్యమీనన్తో ఓ సినిమా, ఐశ్వర్యలక్ష్మితో గాడ్సే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సత్యదేవ్ కంటెంట్ రిచ్ చిత్రాలు చేస్తూ చాలా మంది యువ హీరోలకు స్పూర్తిగా నిలుస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.