ఇటీవల కొందరు రిపోర్టర్లు స్కూళ్లకు వెళ్లి టీచర్లను ప్రశ్నలు వేస్తున్నారు. చాలామంది టీచర్లు తడబడడం చూస్తున్నాం. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తున్నది. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు టీచర్ ఇచ్చిన సమాధానం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నది.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో ‘సఖ్త్లాగ్’ అనే వినియోగదారు షేర్ చేశారు. ఈ వీడియోలో రిపోర్టర్ ఓ టీచర్ వద్దకు వెళ్లి ‘జనవరి’ స్పెల్లింగ్ అడుగుతాడు. దానికామె.. ‘ఇది చాలా ఈజీ.. మా పిల్లలను అడిగినా చెబుతారు’ అని అటువైపు మళ్లిస్తుంది. దీంతో రిపోర్టర్ ఓ పిల్లోడిని అడగ్గా, అతడు తప్పు సమాధానం చెబుతాడు. తర్వాత మళ్లీ టీచర్‌ను చెప్పాలని కోరగా, ఆమె ‘జేఏఎన్వై.. జనవరి’ అని చెబుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ టీచర్‌పై మండిపడుతున్నారు. ఇప్పటివరకూ లక్షకు పైగా వీక్షణలను ఈ వీడియో సొంతం చేసుకున్నది.