భవిష్యత్ ప్రణాళిక, కుటుంబాన్ని సాకే విధానం తెలియని వ్యక్తులను ఉద్దేశించిన సామెత ఇది. ఈ తరహా వ్యక్తులు అప్పటికప్పుడే అన్నట్టు ప్రవర్తిస్తారు. చేతినిండా డబ్బు ఉంటే ‘తనంత ధీరుడు లేడు’ అంటూ గొప్పలకు పోతారు. విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. తీరా డబ్బులు అయిపోతే.. మళ్లీ ఊరిమీదపడి అప్పుల కోసం దేవులాడుతుంటారు. కుటుంబాన్ని పట్టించుకోకుండా, పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించకుండా నిత్యం తాగుతూ.. భార్యతో గొడవ పెట్టుకుంటూ.. నరకం సృష్టిస్తారు.
నిత్యం తాగి తన్నులాడే ఇంట్లో బువ్వ దొరకదు. తెల్లారితే (మత్తు దిగితే) మళ్లీ కడుపుకోసం దేవులాట. మద్యానికి బానిసైన ఎన్నో కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంటుంది. అందుకే.. ఎప్పుడూ జీవితంపై ఆశ, చేసే పనిలో నిజాయతీ, భవిష్యత్ గురించి ప్రణాళిక ఉండాలని అంటారు పెద్దలు. ఇలాంటి అర్థాన్నిచ్చే మరో సామెత ‘పొద్దు మూకితే భోగం మాట.. తెల్లారితే దేవులాట’.