పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న భారీ ప్రాజెక్టు ఆది పురుష్. తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. ప్రభాస్ కూడా చిత్రీకరణలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా..సైఫ్ అలీఖాన్ లంకేశ్ గా నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టులో మరో కీ రోల్ లక్ష్మణుడు. మరి ప్రభాస్ సోదరుడిగా ఎవరు కనిపిస్తారంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.తాజాగా ఓ ప్రముఖ నటుడి పేరు తెరపైకి వచ్చింది. యురి సినిమాతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు యువ యాక్టర్ విక్కీకౌశల్. ఈ హీరోనే ఆదిపురుష్లో లక్ష్మణుడిగా కనిపించబోతున్నాడట. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన బయటకు రాలేదు. ఫీమేల్ లీడ్ ఎవరు చేస్తున్నారన్నది సస్పెన్స్ గానే ఉంది.లోకల్ టు గ్లోబల్..వార్త ఏదైనా..అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.