రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది వారియర్’. లింగుస్వామి దర్శకుడు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. జూలై 14న విడుదలకానుంది. ఈ సినిమాలోని ‘విజిల్..’ పాటను ప్రముఖ హీరో సూర్య ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. రామ్ మాట్లాడుతూ ‘దేవిశ్రీప్రసాద్ మంచి ట్యూన్ ఇచ్చారు.
దర్శకుడు లింగుస్వామి ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. నేను పనిచేసిన దర్శకుల్లో ఆయనే ది బెస్ట్’ అన్నారు. ‘సినిమాలో ఓ ప్రత్యేకమైన సందర్భంలో ఈ పాట వస్తుంది. ప్రేక్షకులందరూ విజిల్స్ వేస్తారు. నేను గతంలో మాధవన్, సూర్య, విక్రమ్, అజిత్ వంటి స్టార్స్‌తో పనిచేశా. రామ్ ప్రత్యేకత ఏమిటంటే..సినిమా ఆరంభం నుంచి ఇప్పటివరకు ఆయనలో అవే ఎనర్జీ లెవల్స్ ఉన్నాయి’ అని లింగుస్వామి అన్నారు.