హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్‌కమిటీ సమావేశం కానున్నది. ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో ఆర్థిక సమస్యల పరిష్కారంపై సబ్‌కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సబ్‌కమిటీ గురువారం సమావేశం అవుతున్నది. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కా ర్పొరేషన్ విభజన, ఏపీ జెన్కోకు తెలంగాణ డి స్కమ్లకు మధ్యన బకాయిలు, పన్నుల్లో వాటా, తెలంగాణ పౌరసరఫరాల సంస్థకు రావాల్సిన క్యాష్ క్రెడిట్‌పై చర్చిస్తారు.