e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 11, 2021
Home News బ్యూరోక్రాట్లకు పదోన్నతులు

బ్యూరోక్రాట్లకు పదోన్నతులు

బ్యూరోక్రాట్లకు పదోన్నతులు


హైదరాబాద్‌, మార్చి10(నమస్తే తెలంగాణ): ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ 21 జీవోలు విడుదల చేశారు. రాష్ట్రంలో 31 మంది ఐఏఎస్‌లు, 9 మంది ఐపీఎస్‌లు, 8 మంది ఐఎఫ్‌ఎస్‌లు పదోన్నతి పొందారు. 1986 బ్యాచ్‌కు చెందిన ఆర్‌ శోభను పూర్తిస్థాయి పీసీసీఎఫ్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 1990 బ్యాచ్‌కు చెందిన శశాంక్‌ గోయల్‌, సునీల్‌శర్మ, 1991 బ్యాచ్‌కు చెందిన రజత్‌కుమార్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించింది. 1991 బ్యాచ్‌కు చెందిన కే రామకృష్ణారావు, హరిప్రీత్‌సింగ్‌, అర్వింద్‌కుమార్‌, జీ అశోక్‌కుమార్‌ (సెంట్రల్‌ డిప్యూటేషన్‌)కు అపెక్స్‌ స్కేల్‌ పదోన్నతి కల్పించింది.
అలాగే 1996 బ్యాచ్‌కు చెందిన బీ జనార్దన్‌రెడ్డి, దానకిషోర్‌ ముఖ్యకార్యదర్శిగా పదోన్నతి పొందారు. సూపర్‌టైం స్కేల్‌లో గౌరవ్‌ ఉప్పల్‌, కే మాణిక్‌రాజ్‌, చంపాలాల్‌, లింబాద్రి(డిప్యూటేషన్‌), సెలక్షన్‌గ్రేడ్‌లో 2006-08 బ్యాచ్‌లకు చెందిన వెంకట్రామిరెడ్డి, ఏ దేవసేనను చేర్చారు. జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ క్యాడర్‌ స్కేల్‌లో 2011-12 బ్యాచ్‌లకు చెందిన శ్వేత మహంతి, పాటిల్‌ ప్రశాంత్‌ జీవన్‌, కల్లు శివకుమార్‌ నాయుడు, డీ కృష్ణభాస్కర్‌, అలుగువర్షిణి, రాజీవ్‌గాంధీ హన్మంతు, కేవీ కర్ణన్‌, డాక్టర్‌ కొర్ర లక్ష్మి, సీనియర్‌ టైమ్‌ స్కేల్‌ అధికారులుగా పదోన్నతి పొందారు. 2016-17 బ్యాచ్‌లకు చెందిన బాదావత్‌ సంతోష్‌, ఎం ఖాన్‌, మిక్కిలినేని మనుచౌదరి, ఐల త్రిపాఠి, రాహుల్‌శర్మ, రాజర్షిషా, ప్రతీక్‌జైన్‌, మొగిలి స్నేహలత, వెంకటేశ్‌ దోత్రె, సంతోష్‌కు పదోన్నతులు కల్పించారు.
అడిషినల్‌ డీజీపీగా సజ్జనార్
1996 బ్యాచ్‌కు చెందిన చారుసిన్హా, అనిల్‌కుమార్‌, వీసీ సజ్జనార్‌ను అడిషనల్‌ డీజీపీగా ప్రమోట్‌ చేశారు. 2007 బ్యాచ్‌కు చెందిన విక్రమజిత్‌ దుగ్గల్‌ (డిప్యూటేషన్‌ పంజాబ్‌) డీఐజీగా, 2008 బ్యాచ్‌కు చెందిన టీ ఇక్బాల్‌కు సెలక్షన్‌ గ్రేడ్‌ అధికారిగా, 2003 బ్యాచ్‌కు చెందిన షానవాజ్‌ ఖాసీం ఐజీపీగా పదోన్నతి పొందారు. 2015-16 బ్యాచ్‌కు చెందిన రాజేశ్‌చంద్ర పోతురాజు, సాయి చైతన్య, శరత్‌ చంద్రపవార్‌కు సీనియర్‌ టైమ్‌స్కేల్‌, 2013 బ్యాచ్‌కు సీనియర్‌ టైమ్‌స్కేల్‌ అధికారిగా మైలా బత్తుల చేతనలకు పదోన్నతులు కల్పించారు.
పీసీసీఎఫ్‌ శోభ పోస్టు క్రమబద్ధీకరణ
1986 బ్యాచ్‌కు చెందిన పీసీసీఎఫ్‌ శోభ పోస్టును రెగ్యులరైజ్‌ చేశారు. ఇప్పటివరకు ఆమె పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించారు. అలాగే 1996 బ్యాచ్‌కు చెందిన సునీత ఎం భాగవత్‌ సూపర్‌టైమ్‌ స్కేల్‌లో ఏపీసీసీఎఫ్‌గా పదోన్నతి ఇచ్చారు. 2003 బ్యాచ్‌కు చెందిన బీ సైఫుల్లా, ప్రియాంకవర్గీస్‌, సీపీ వినోద్‌కుమార్‌, రామలింగం, ఎస్‌జే ఆషాలకు చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌గా, 2015 బ్యాచ్‌కు చెందిన డీఎఫ్‌ఓ ములుగు వీ ప్రదీప్‌కుమార్‌ శెట్టికి సీనియర్‌ టైమ్‌ స్కేల్‌ అధికారిగా పదోన్నతి కల్పించారు.

Advertisement
బ్యూరోక్రాట్లకు పదోన్నతులు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement