e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home News చమురు ధరల పెంపు అహేతుకం

చమురు ధరల పెంపు అహేతుకం

చమురు ధరలు పెరగడానికి సాధారణంగా కొన్ని కారణాలుంటాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు, విదేశీ మారకం రేటు, సబ్సిడీలు, చమురు సంస్థల లాభాలు మొదలైన కారణాల వల్ల దేశంలో చమురు ధరలు పెరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం ప్రభుత్వం చమురు ధరలు పెంచడానికి ఇవేవీ కారణం కాదు.  

చమురు ధరల పెంపు అహేతుకం

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగ లేదు. రూపాయితో పోలిస్తే డాలర్‌ విలువ పెరగడం వల్ల మరింత ధర చెల్లించవలసి వస్తున్నదా అంటే అదీ కాదు. పెట్రోలి యం ఉత్పత్తులకు ఇచ్చే సబ్సిడీ భారం  పెరిగిందా అంటే, లేదు. అంతర్జాతీయ మార్కెట్‌ ప్రకారం ధరలు ఉండాలంటే, ముడి చమురు ధరలు పెరిగినప్పుడు ఇక్కడ పెట్రోలియం ఉత్పత్తుల ధర పెరగాలి అక్కడ తగ్గినప్పుడు, ఇక్కడ కూడా తగ్గాలి. కానీ మార్కెట్‌ శక్తుల ప్రకారం ముడిచమురు ధరలు తగ్గినప్పుడు కూడా ఇక్కడ ప్రభుత్వం ధరలు తగ్గించడం లేదు.  

కొన్ని రాష్ర్టాల్లో  లీటరు పెట్రోలు ధర వంద రూపాయలు! డీజిల్‌ కూడా ఇదే స్థాయిలో పెరిగింది. ముడి చమురు రేటు ఈ రీతిలో పెరగనే లేదు. దిగుమతుల భారం లేదు. ఈ ఏడాది జనవరిలో ముడి చమురు ధర ఒక బ్యారెల్‌కు (159 లీటర్లు) 54.79 డాలర్లు. ఇదే సమయంలో ఢిల్లీలో పెట్రోలు లీటరుకు 86.34 రూపాయలు. 2013 సెప్టెంబర్‌లో ముడి చమురు బ్యారెల్‌ ధర 111.59 డాలర్లు. అప్పుడు ఇదే ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర 76.06. పోనీ రూపాయి- డాలర్‌ విలువలో తేడా కారణమా అంటే అదీ కాదు. 2013లో ఒక డాలర్‌కు 66.89 రూపాయలు. ఈ లెక్కన ఒక లీటరు ముడి చమురు ధర రూ.46.94. 2021 జనవరిలో ఒక డాలరుకు 72.90 రూపాయలు. ఈ లెక్కన లీటర్‌ ముడి చమురు ధర రూ.25.12. 

చమురు మార్కెటింగ్‌ కంపెనీలు నష్టాల్లో లేవు కనుక, ఈ కారణంగా పెట్రోలు ధర పెంచారా అంటే అదీ కాదు. సంబంధిత పబ్లిక్‌ రంగ సంస్థలన్నీ కలసి 2018-19లో పన్నులు చెల్లించిన అనంతరం రూ.69,714 కోట్ల లాభంలో ఉన్నాయి. ఏడేండ్లుగా లాభాలు పెరుగుతూనే ఉన్నాయి. 2012-13లో రూ.39,419 కోట్ల లాభం పొందాయి. 

ప్రభుత్వం మీద సబ్సిడీ భారం ఉందా అంటే అదీ లేదు. 2012-13 నుంచి 2018-19 వరకు గణాంకాలు చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రెవెన్యూ పెరుగుతూనే ఉన్నది. 2018-19 గణాంకాల ప్రకారం- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముడి చమురు ద్వారా రూ.16,964 కోట్లు, సహజవాయువు ద్వారా రూ.2,364 కోట్లు, చమురు అభివృద్ధి సెస్‌ ద్వారా రూ.18,984 కోట్లు, ఎక్సైజ్‌, కస్టమ్స్‌ సుంకాల ద్వారా రూ.1,63,162 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.2,01,265 కోట్లు డివిడెండ్‌ ద్వారా రూ. 30,323 కోట్ల ఆదాయం పొందాయి. ఇవన్నీ కలిపి ఒకే ఏడాదిలో పొందిన ఆదాయం రూ.4,33,062 కోట్లు. తర్వాత సవరించిన లెక్కల ప్రకారం ఈ ఆదాయం మరింత పెరిగింది. మొత్తం ఆదాయం రూ. 5,75,632 కోట్లు కాగా ఇందులో కేంద్రం వాటా రూ.3,48,041 కోట్లు. ఇది మొత్తం రెవెన్యూ వసూళ్లలో 22 శాతం. మిగిలిన 2,27,591 కోట్లు రాష్ర్టాలకు చేరాయి. ఇది వాటి రెవెన్యూ వసూళ్లలో ఎనిమిది శాతం. ఇదే ఏడాది కేంద్రం పెట్రోలియం రంగానికి ఇచ్చిన సబ్సిడీ 24,837 కోట్లు. ఇది కేంద్రం పెట్రోలియం రంగం నుంచి పొందిన ఆదాయంలో 7.13 శాతం. కేంద్ర రాష్ర్టాల మొత్తం ఆదాయంలో 4.3 శాతం. దీన్నిబట్టి పెట్రోలియం రంగం నుంచి ప్రభుత్వాలు ఇచ్చే కన్నా తీసుకునేదే ఎక్కువగా ఉన్నదని స్పష్టమవుతున్నది. 

ఎరువులు, ఆహారం, పెట్రోలియం.. అన్నిటికీ కలిపి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ రూ.1,96,769 కోట్లు. ఇది కేంద్ర పెట్రోలియం రెవెన్యూలో 56.53 శాతం. మొత్తం పెట్రోలియం రంగ ఆదాయంలో 34.18 శాతం. దీన్నిబట్టి కేంద్రసబ్సిడీ భారమంతా ఈ రంగం నుంచే తీరుతున్నదని అర్థమవుతున్నది. వాస్తవం చెప్పాలంటే, ప్రభుత్వం ధరల నియంత్రణ విధానానికి స్వస్తి చెప్పినందున ఇక ధరల హెచ్చుతగ్గులలో తలదూర్చకూడదు. కానీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నది. 

ఎరువులు, ఆహారం, పెట్రోలియం.. అన్నిటికీ కలిపి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ రూ.1,96,769 కోట్లు. ఇది కేంద్ర పెట్రోలియం రెవెన్యూలో 56.53 శాతం. మొత్తం పెట్రోలియం రంగ ఆదాయంలో 34.18 శాతం. దీన్నిబట్టి కేంద్రసబ్సిడీ భారమంతా ఈ రంగం నుంచే తీరుతున్నదని అర్థమవుతున్నది. వాస్తవం చెప్పాలంటే, ప్రభుత్వం ధరల నియంత్రణ విధానానికి స్వస్తి చెప్పినందున ఇక ధరల హెచ్చుతగ్గులలో తలదూర్చకూడదు. కానీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నది. అందువల్ల ప్రభుత్వం తాను కోరుకున్న సందర్భంలో పెరుగుదలను నియంత్రించవచ్చు. ధరలు పెరగకుండా పన్నులను తగ్గించవచ్చు. 

దేశ పెట్రోలియం అవసరాలకు 85 శాతం దిగుమతుల మీద ఆధారపడుతున్నాం. అయినప్పటికీ ధరలు పెరగడానికి ఇది కారణం కాదు. మన దేశం పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తున్నదనేది గమనించాలి. 

చమురు మార్కెటింగ్‌ కంపెనీలు నష్టాల్లో లేవు కనుక, ఈ కారణంగా పెట్రోలు ధర పెంచారా అంటే అదీ కాదు. సంబంధిత పబ్లిక్‌ రంగ సంస్థలన్నీ కలసి 2018-19లో పన్నులు చెల్లించిన అనంతరం రూ.69,714 కోట్ల లాభంలో ఉన్నాయి. ఏడేండ్లుగా లాభాలు పెరుగుతూనే ఉన్నాయి.. ప్రభుత్వం మీద సబ్సిడీ భారం ఉందా అంటే అదీ లేదు. 

వ్యయాన్ని లెక్కించే ముందు ముడి చమురు దిగుమతి ధరనే కాదు, ముడి చమురు ఎగుమతుల ఆదాయం, దేశీయ ఉత్పత్తిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అన్ని వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలి. తప్పుదోవ పట్టించే సమాచారంతో ప్రజలను భయపెట్టకూడదు. ధరలను పరిమితి దాటకుండా చూస్తూ, పన్ను, పన్నేతర మార్గాల ద్వారా పొందుతున్న ఆదాయాన్ని కూడా ప్రభుత్వం ప్రజలకు తెలియపరచాలె. రాజకీయ పక్షాలు పరస్పర విమర్శలకు దిగే బదులు పెట్రోలియం పరిశ్రమ, ప్రజల ప్రయోజనాలు పరస్పరం ముడిపడి ఉన్నవని అర్థం చేసుకోవాలి. 

పెట్రోలియం రంగం దిగుమతిపై ఎక్కువగా ఆధారపడి ఉండటమే కాదు, దేశంలో ద్రవ్యోల్బణం పెంచగలదు. తద్వారా ప్రజల నిజ ఆదాయాలకు గండికొట్టకలదు. అందువల్ల లాభాల కోసం ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టకూడదు. 

(రచయిత అభివృద్ధి ఆర్థికవేత్త, ఆర్థిక సామాజిక వ్యవహారాల వ్యాఖ్యాత)

(సౌజన్యం: ది హిందూ బిజినెస్‌ లైన్‌)

చమురు ధరల పెంపు అహేతుకం
Advertisement
చమురు ధరల పెంపు అహేతుకం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement