పార్టీ నియమావళిలో మార్పులు
హైదరాబాద్, అక్టోబర్ 25 ( నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్టీ నియమ నిబంధనల్లో స్వల్ప మార్పులకు పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఆమోదం తెలిపింది. హైటెక్స్‌లో జరిగిన సమావేశంలో సవరణలను పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ చదివి వినిపించగా.. ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆ మోదించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించే అధికారాన్ని అధ్యక్షుడికి అప్పగిస్తూ తీర్మానం చేశారు. జిల్లా, నియోజకవర్గస్థాయి కార్యవర్గ పార్టీ వ్యవస్థలను నిర్మించే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడికి అప్పగిస్తూ తీర్మానించారు. పార్టీ అధ్యక్షుడు అం దుబాటులో లేని సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ఆ బా ధ్యతలు సంక్రమించేలా సవరణలు చేశారు.