ఆట సందీప్, మేఘన రాజ్పుత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రేంజ్ రోవర్’. ఈ చిత్రాన్ని ఓఎస్ఆర్ కుమార్ ఇండియన్ పిక్చర్ పతాకంపై ఓఎస్ఆర్ కుమార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. అరవింద్ యతిరాజ్, బ్యాంక్ జనార్ధన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ను నటుడు అలీ విడుదల చేశారు.
అనంతరం టైటిల్ బాగుందని, సినిమా విజయం సాధించాలని కోరుతూ చిత్ర బృందానికి విశెస్ తెలిపారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రాజ్ శివశంకర్, సంగీతం : సత్య సోమేష్.