ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 30: మానసిక స్థితి సరిగాలేని యువతి అదృశ్యమైన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓయూ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హబ్సిగూడలో నివసించే శ్రీనివాసులు కూతురు మానస (24) మానసికస్థితి సరిగా లేకపోవడంతో చికిత్స తీసుకుంటున్నది. మంగళవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటికి వెళ్లిన మానస తిరిగి కనిపించలేదు. కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.