వరంగల్ రూరల్ : అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధమైన సంఘటన జిల్లాలోని నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామంలో చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రావుల దేవేందర్ ఇంట్లో మంటలు చెలరేగాయి. వెంటనే దేవేందర్ కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రమాదంలో వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లోని వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. రూ. 4 లక్షల నగదు, మరో రూ 5. లక్షల విలువచేసే పంట ఉత్పత్తులు, ఇతర వస్తువులు, సామగ్రి కాలి పోయినట్లు బాధితుడు తెలిపాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.