అమరావతి : తెలుగు ఛానల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షో ను బ్యాన్ చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది. బిగ్‌బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని, బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ (IBF Guide lines) గైడ్లైన్స్పాటించలేదని పిటిషనర్ తరుపున న్యాయవాది శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం కూడా బిగ్‌బాస్ అశ్లీలతపై మండిపడింది.
ఈ సందర్భంగా 1970 లలో సినిమాల విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. కేంద్రం తరఫు న్యాయవాది దీనిపై స్పందించేందుకు సమయం కోరగా ప్రతివాదులకు నోటీసుల విషయాన్ని తదుపరి వాయిదాలో నిర్ణయి స్తామని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణను అక్టోబరు 11కు న్యాయస్ధానం వాయిదా వేసింది. బిగ్‌బాస్‌ను రద్దు చేయాలని సీపీఐ నాయకుడు నారాయణతో పాటు పలువురు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.