అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) కాంబోలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ఘోస్ట్’ (The Ghost). ఈ చిత్రం భారీ అంచనాల మధ్య చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్‌తో పోటీగా విడుదలైంది. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కాగా సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో వెనకబడినట్టు ఇప్పటివరకు వచ్చిన వసూళ్లు చెబుతున్నాయి.
తాజాగా నైజాం ఏరియాలో నాలుగో రోజు వసూళ్లకు సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. నాలుగో రోజు రూ.50 లక్షలు రాబట్టగా..దీంతోకలిపి మొత్తం రూ.2.5 కోట్లు వసూళ్లు చేసినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. సినిమా భవితవ్యం ఎలా ఉండబోతుందనేది నేడు, రేపు తెలియనుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ది ఘోస్ట్ చిత్రంలో సోనాల్ చౌహాన్ ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించగా..గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీ రోల్స్ పోషించారు. ది ఘోస్ట్ చిత్రానికి మార్క్ కే రాబిన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా తెరకెక్కించారు.
Read Also : Trivikram Srinivas | త్రివిక్రమ్ మొదటి సినిమా స్పెషల్ షో..వివరాలివే..!
Read Also : Ram Charan | రాంచరణ్ కొత్త లుక్ వైరల్..నెటిజన్లు ఇంప్రెస్
Read Also : Simbu | ‘కేజీఎఫ్’ నిర్మాణ సంస్థలో.. శింబు భారీ బడ్జెట్ సినిమా?