హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి చెప్పారు. కులాలు, మతాల పేరుతో విభజించాలని చూస్తున్న పార్టీలతో విసుగుచెందిన ప్రజలకు కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీ అనివార్యమైందని అన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డల మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. నాలుగేండ్ల క్రితమే ఆస్ట్రేలియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలతో భారీ ఎత్తున నిర్వహించిన కార్యక్రమంలో భారతదేశానికి చెందిన అన్ని రాష్ట్రాల ప్రధాన పార్టీలకు చెందిన ఎన్నారైలు కేసీఆర్కు మద్దతు ప్రకటించారని గుర్తుచేశారు.