Tiago NRG XT | ఇటీవలి కాలంలో కార్ల సేల్స్‌లో మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్స్‌లకు గట్టి పోటీ ఇస్తున్న టాటా మోటార్స్ దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను అప్‌గ్రేడ్ చేస్తూ.. వివిధ కేటగిరీల్లో పాపులర్ మోడల్ కార్లను మార్కెట్లోకి తెస్తున్నది. ఇప్పటివరకు టాటా మోటార్స్ కార్లలో పాపులరైన టియాగో.. కొనసాగింపుగా టియాగో ఎన్ఆర్జీ మోడల్ కారు టీజర్ విడుదల చేసింది. నూతన టియాగో ఎన్ఆర్జీ.. ఎక్స్‌టీ వేరియంట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. అంతే కాదు.. పాత టియాగో కంటే తక్కువ ధరకే కస్టమర్లకు అందుబాటులోకి రానున్నదని చెబుతున్నారు. త్వరలో టియాగో ఎన్ఆర్జీ ఎక్స్‌టీ వేరియంట్‌ను టాటా మోటార్స్ మార్కెట్లోకి విడుదల చేయనున్నదని సమాచారం.
టియాగో ఎన్ఆర్జీ వర్షన్ కారుకు కేవలం కాస్మొటిక్స్ మార్పులు మాత్రమే తీసుకొచ్చారు. రెగ్యులర్ టియాగోతో పోలిస్తే టియాగో ఎన్ఆర్జీ 37 మి.మీ. పొడువుగా ఉంటుంది. వెనుకవైపు ఎక్స్ట్రా క్లాడింగ్, ఫ్రంట్ ఎక్స్ట్రా లెంత్ కలిగి ఉంటుంది. పాత టియాగో గ్రౌండ్ క్లియరెన్స్ 170 మి.మీ. అయితే.. నూతన వేరియంట్ టియాగో ఎన్ఆర్జీ 181 మి.మీ. ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఎగుడుదిగుడు రోడ్లపై సజావుగా డ్రైవ్ చేసేందుకు వీలుగా ఎక్స్ట్రా గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు.
నూతన టియాగో ఎన్ఆర్జీ కూడా 1.2 లీటర్లతోపాటు త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తోనే వుస్తుంది. గరిష్ఠంగా 84 బీహెచ్పీ ఇంధనం, 113 ఎన్ఎంల టార్చి వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్బ్యాక్స్, 5-స్పీడ్ ఏఎంటీతో వస్తోంది. ఎక్స్‌టీ వేరియంట్ టియాగో ఎన్ఆర్జీలో ఏఎంటీ గేర్ బ్యాక్స్ ఆఫర్ చేస్తారా.. లేదా.. వెల్లడించలేదు. టియాగో ఎన్ఆర్జీ ధర రూ.6.82 లక్షల నుంచి మొదలవుతుంది. టియాగో ఎన్ఆర్జీ ఎక్స్‌టీ వేరియంట్ ధర అంత కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.