Thalapathy 67 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం సినిమాల వేగాన్ని పెంచాడు. ఈ ఏడాది ‘బీస్ట్’తో అభిమానులను నిరాశపరిచిన విజయ్.. ‘వారసుడు’ సినిమాతో ఎలాగైన బ్లాక్‌బస్టర్ సాధించాలని కసితో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే.. విజయ్, లోకేష్ కనగరాజు మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్లో షూటింగ్ మొదలు పెట్టనుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజు.. ‘LCU’లో భాగంగా తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుందట. ‘విక్రమ్’ సినిమాకు కొనసాగింపుగా ఈ చిత్రం ఉండనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ, ఈ వార్తతో సినీ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్‌ను ఎంపిక చేసినట్లు టాక్. ఇటీవలే విక్రమ్‌తో భారీ విజయాన్ని సాధించిన లోకేష్ కనగరాజు.. ఈ చిత్రంతో ఇంకెంత విధ్వంసాన్ని సృష్టిస్తాడో అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా త్రిష హీరోయిన్గా నటిస్తుంది.
Read Also:
Suriya 42 | సూర్య సినిమాకు ఓటీటీ సంస్థల నుండి భారీ ఆఫర్.. వామ్మో అన్ని కోట్లా?
Karthikeya-2 | ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తున్న ‘కార్తికేయ-2’.. ‘జీ-5’లో నిఖిల్ సరికొత్త రికార్డు
Varun Tej | ఆసక్తి రేకెత్తిస్తున్న ‘VT13’ స్పెషల్ పోస్టర్..!
Price Movie | ‘ప్రిన్స్’ మూవీ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?