హైదరాబాద్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. భారీ వర్షాల కారణంగా పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు. వర్సిటీ పరిధిలో ప్రస్తుతం డిగ్రీ, పీజీ, బీఈడీ పరీక్షలు జరుగుతున్నాయి. వాయిదా పడిన పరీక్షల తేదీలను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామో తర్వాత ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.