సిడ్ని : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజును పురస్కరించుకుని తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా స్థానికంగా ఉన్న ఓ పార్కును శుభ్రం చేసింది. ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో ఆస్ట్రేలియా తెలంగాణ జాగృతి సభ్యులు చురుకుగా పాల్గొన్నారు. అంతా కలిసి సమాజానికి మార్పు చూపిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా అధ్యక్షుడు శ్రీకర్ రెడ్డి అండెం, విజయ్ కొరబోయినా, స్మిత నాగ్పూర్కర్, రంజిత్, నిఖిల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీకాంత్ పొగాకు, అనుషా సామ పాల్గొన్నారు.