బర్మింగ్‌హాం: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మరో పతకం సాధించింది. హైజంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ హైజంప్ విభాగంలో దేశానికి పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా రికార్డుల్లో నిలిచాడు. బుధవారం రాత్రి జరిగిన హైజంప్ ఫైనల్స్‌లో శంకర్ 2.22 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌కు చెందిన హమీష్ కెర్ 2.25 మీటర్ల జంప్‌చేసి మొదటి స్థానంలో నిలువగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్ స్టార్క్ సిల్వర్ సాధించాడు.
అయితే జూన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో శంకర్ 2.27 మీటర్ల దూరం జంప్ చేయడం గమనార్హం. శంకర్ గత రికార్డుతో పోల్చితే కామన్వెల్త్లో కొంత నిరాశ పరిచినప్పటికీ హైజంప్‌లో దేశానికి తొలిపతకం తీసుకొచ్చిన ప్లేయర్‌గా నిలిచాడు.
HISTORIC FEAT 🤩
🇮🇳's National Record holder @TejaswinShankar becomes the 1️⃣st ever Indian to clinch a 🏅 in high jump at #CommonwealthGames
He bags BRONZE 🥉in Men's High Jump with the highest jump of 2.22m at @birminghamcg22 🔥#Cheer4India#India4CWG2022
1/1 pic.twitter.com/jby6KmiA2h— SAI Media (@Media_SAI) August 3, 2022
కాంస్య పతకం సాధించిన శంకర్‌ను కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అభినందించాడు. కామన్వెల్త్ క్రీడల్లో హైజంప్ విభాగంలో పతకం సాధించిన మొదటి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడని ప్రశంసించారు.
Union Sports Minister Anurag Thakur congratulates Tejaswani Shankar on winning a Bronze medal in men's high jump at the #CommonwealthGames2022
"First-ever Indian athlete to win a medal in high jump at CWG for India.Congratulations Tejaswani Shankar on creating history,"he tweets pic.twitter.com/0siEg54NGI
— ANI (@ANI) August 3, 2022