మాడ్రిడ్, ఆగస్టు 29: రాత్రిపూట 8 గంటల కంటే తక్కువ నిద్రించే టీనేజర్లలో అధిక బరువు, ఊబకాయం సమస్యలు పెరుగుతున్నట్టు స్పెయిన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది.
కంటికి తగినంత నిద్ర ఉన్న వారితో పోలిస్తే, వీరిలో హైబీపీ, రక్తంలో కొవ్వు, షుగర్ స్థాయిల్లో పెరుగుదల, పొట్ట పెరిగిపోవడం వంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నట్టు పరిశోధకులు తెలిపారు.