e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్: ఈవీ చార్జింగ్‌లో 12 వేల కొలువులు

ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్: ఈవీ చార్జింగ్‌లో 12 వేల కొలువులు

ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్: ఈవీ చార్జింగ్‌లో 12 వేల కొలువులు

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో దెబ్బ‌తిన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టేందుకు ముడి చ‌మురు దిగుమ‌తిపై గ‌త ఏడాది కాలంలో కేంద్రం రెండు ద‌ఫాలు భారీగా దిగుమ‌తి సుంకాలు పెంచేసింది. దీనికి మ‌రో కార‌ణం కూడా ఉంది.. పారిస్ ఒప్పందం ప్ర‌కారం మున్ముందు క‌ర్బ‌న ఉద్గారాల నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.. మ‌రోవైపు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్తున్న వేళ‌.. దేశంలో ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ గిరాకీ క్రమంగా పుంజుకుంటున్న‌ది. త‌ద‌నుగుణంగా దేశవ్యాప్తంగా ఛార్జింగ్‌ కేంద్రాలు కూడా అందుబాటులోకి తేవాల్సిన అవ‌స‌రం కూడా ఉంది.

ఈవీ రంగంలో యువ‌త‌కు కొలువులు ఇలా

ఈ క్రమంలో యువ‌త‌రానికి కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ప్ర‌స్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)మూడో త్రైమాసికం తర్వాత విద్యుత్ చార్జింగ్ కేంద్రాల్లో దాదాపు 10,000-12,000 ఉద్యోగాలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని ‘టీంలీజ్‌ సర్వీసెస్’‌ అనే అనే‌ కన్సల్టింగ్‌ సంస్థ అంచనా వేసింది.

3 నెల‌ల్లో చార్జింగ్ స్టేష‌న్ల‌లో సిబ్బంది నియామ‌కాలు

వ‌చ్చే మూడు నెలల్లో వివిధ విద్యుత్‌ వాహన సంస్థలు చార్జింగ్ స్టేష‌న్ల‌లో త‌మకు అవ‌స‌రమైన సిబ్బందిని నియ‌మించ‌డం ప్రారంభించవచ్చని టీం లీజ్ పేర్కొంది. తొలి ద‌శ‌లో నాలుగు మెట్రో నగరాలు, నాలుగు కాస్మోపాలిటన్‌ సిటీల్లో 60 వరకు ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపింది.

2018-19 నుంచి ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ సేల్స్ ఇలా

2018-2019 ఆర్థిక సంవత్సరంలో 1,29,600 యూనిట్లు, 2019-20లో 1,55,400 యూనిట్ల ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్‌ అమ్ముడు అయ్యాయ‌ని సొసైటీ ఆఫ్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్ తెలిపింది. 2020-21లో కొవిడ్‌ ప్రభావం దృష్ట్యా అవి 1,40,000 యూనిట్లకు పరిమితమై ఉంటాయని అంచనా వేశారు.

ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్: ఈవీ చార్జింగ్‌లో 12 వేల కొలువులు

ఫేమ్-2 ప్ల‌స్ త‌క్కువ జీఎస్టీ వ‌ర్తింపు

మ‌రోవైపు కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ తయారీని ప్రోత్సహించ‌డానికి ప‌లు చర్యలను చేపట్టింది. విద్యుత్ వాహ‌నాల‌కు తక్కువ జీఎస్టీ రేటు వ‌ర్తింప‌జేయ‌డంతోపాటు ఫాస్టర్‌ ఆడాప్షన్‌ అండ్‌ మ్యానుఫాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ అండ్‌ హైబ్రిడ్‌ వెహికల్స్ (ఫేమ్‌-2‌) పథకం అమ‌లులోకి తెచ్చింది. దీని వల్ల ప‌లు ప్రధాన వాహన తయారీ సంస్థలు ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ ప్రొడ‌క్ష‌న్ వైపు మళ్లాయి.

కేంద్రంతోపాటు రాష్ట్రాల ప్రోత్సాహాలు ఇలా

కేంద్ర ప్ర‌భుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించాయి. 2030 నాటికి దేశంలో వ్యక్తిగత విద్యుత్‌ కార్లు 20-30 శాతం, టూ వీల‌ర్స్ 25-35 శాతం, త్రీవీల‌ర్స్ 65-75 శాతం పెరిగే అవకాశం ఉందని కేపీఎంజీ అంచనా వేసింది.

ఎల‌క్ట్రిక్ వాహ‌న రంగంలోకి టెస్లా ప్ల‌స్ ఓలా ఎల‌క్ట్రిక్

ఇప్పటికే ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్‌ తయారీ రంగంలో ఉన్న సంస్థలతోపాటు తాజాగా ఓలా ఎలక్ట్రిక్‌, టెస్లా మోటార్స్ ఈ రంగంలోకి ఎంట‌ర‌య్యాయి. దీంతో ఈ రంగంలో రానున్న మూడు నెలల్లో ఉద్యోగ నియామకాలు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

నిపుణుల నియామ‌కానికి ప్రాధాన్యం

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో ‘కండక్టెడ్‌, రేడియేటెడ్‌ ఎమిషనన్స్‌’ విభాగంలో నైపుణ్యం ఉన్నవారిని ఉన్నతస్థాయి ఉద్యోగాలకు తీసుకునే అవకాశం ఉందని టీంలీజ్‌ తెలిపింది. అలాగే డిప్లోమా, ఐటీఐ సర్టిఫికెట్‌తో పాటు ఈ రంగంలో అనుభవం ఉన్నవారికి కిందిస్థాయి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని తెలిపింది.

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

ఇవి కూడా చదవండి..

ముంబైలో ఇల్లు కొన్న డీమార్ట్‌ యజమాని.. ఇంటి ధర ఎంతంటే..?

డ్రైవింగ్‌ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ

ఈ పరిస్థితుల్లో ఇండియా నుంచి దిగుమతులు చేసుకోలేం: ఇమ్రాన్‌ఖాన్‌

లైవ్‌లో రిపోర్టర్‌ మైక్రోఫోన్‌ ఎత్తుకెళ్లిన కుక్క

లాక్‌డౌన్‌ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి

అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం

షోఫియాన్‌లో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం

ఆర్మీ బలోపేతం వెనుక జనరల్‌ మానెక్‌షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు

రంగ్ దే 8 డేస్ కలెక్షన్స్ .. లక్ష్యానికి చాలా దూరంలో నితిన్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్: ఈవీ చార్జింగ్‌లో 12 వేల కొలువులు

ట్రెండింగ్‌

Advertisement