హైదరాబాద్ : తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఈవెంట్ ఆర్గనైజర్, అసోసియేటెడ్ ప్రొఫెషనల్స్ అనుబంధ సంఘం తెలంగాణ ఎంటర్టైనర్స్ అసోసియేషన్ (టీఈఏ) సంయుక్తంగా ‘టీసీఈఐ టీ బాక్స్ క్రికెట్-2021 టోర్నీని అక్టోబర్‌లో ప్రారంభించనున్నట్లు టీసీఈఐ ప్రెసిడెంట్ రాఖీ కంకారియా తెలిపారు. టీ బాక్స్ పోటీలను అక్టోబర్ 2-3 తేదీల్లో ఆరాంఘర్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈవెంట్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు మహిళా క్రికెట్లతో పాటు పన్నెండు మంది ఆటగాళ్లతో కూడిన ఎనిమిది జట్లు టోర్నమెంట్లో పోటీపడనున్నాయి.
రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే టోర్నమెంట్లో ప్రతి జట్టు ఎనిమిది ఓవర్లు ఆడుతుందని పేర్కొన్నారు. టోర్నీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న ఈవెంట్ ఇండస్ట్రీకి చెందిన ఔత్సాహికులు 99669 96621, 9959154371, 9963980259 నంబర్లలో సంప్రదించాలని జాయింట్ సెక్రెటరీ తౌఫిక్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ ఆర్జే చేతన్, జాయింట్ సెక్రెటరీ ఆర్జే షైనీ, ట్రెజరర్ ప్రకాష్ జాదూగర్, ఈసీ మెంబర్లు సౌరభ్ దాగా, వీజే నగేష్, అమిత్ గుప్తా, పవన్ కుమార్ కోరారు.