TATA micro Punch | దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ మైక్రో ఎస్యూవీ పంచ్ కారు బుకింగ్స్ ఈ నెల నాలుగో తేదీన ప్రారంభం కానున్నాయి. అదే రోజు మైక్రో ఎస్యూవీ కారును విపణిలో ఆవిష్కరించనున్నది. బుకింగ్ కోసం ఎంత చెల్లించాలన్న సంగతిని వెల్లడించలేదు. సెడాన్ మోడల్ కార్లకు పోటీగా కొంత కాలంగా దేశీయ మార్కెట్లో ఎస్యూవీ మోడల్ కార్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో మైక్రో ఎస్యూవీ పంచ్ అనే పేరుతో టాటా మోటార్స్ విపణిలోకి తీసుకొస్తున్నది.
పట్టణాలు, నగరాల్లో ప్రయాణించడానికి అనువుగా ఈ కారును టాటా మోటార్స్ డిజైన్ చేసినట్లు తెలుస్తున్నది. అన్ని రకాల టాటా మోటార్స్ కార్లలో మాదిరే ఇందులోనూ ఏడంగుళాల ఫ్రీ స్టాండింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉండే అవకాశం ఉంది.
స్పోర్టీ త్రీ స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఆల్ట్రోజ్ నుండి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్విచ్ గేర్ వంటి ఫీచర్లు జత కలువనున్నాయి. మారుతి సుజుకి ఇగ్నిస్ కంటే టాటా పంచ్ పెద్దగా ఉంటుందని సమాచారం.