Tata Punch Costly | ముడి సరుకు ధరలు, రవాణా చార్జీలు, చిప్ కొరత వల్ల భారం పడుతున్నదని ఆటోమొబైల్ సంస్థలు చెబుతున్నాయి. సంస్థపై ఉత్పాదక వ్యయం బారం తగ్గించుకోవడానికి టాటా మోటార్స్ వివిధ మోడల్ కార్ల ధరలు పెంచేసింది. ఈ నెల 19 నుంచి వివిధ మోడల్ కార్ల ధరలు పెరిగాయి. ఇందులో టాటా పంచ్ మోడల్ కారుపైనా ధరల పెరుగుదల ప్రభావం కనిపించింది. టాటా పంచ్ మినీ ఎస్యూవీ కారు కొనాలంటే అదనంగా రూ.16 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంతకుముందు ఎక్స్ షోరూమ్ టాటా పంచ్ కారు ధర రూ.5.49 లక్షలు కాగా, ఇప్పుడు రూ.5.65 లక్షలకు పెరిగింది. టాటా పంచ్ కారు 14 వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అయితే, వాటిల్లో నాలుగు వేరియంట్ల ధరలు తగ్గడం ఆసక్తి కర పరిణామం.
కూలింగ్ గ్లోబ్ బాక్స్తోపాటు సెకండ్ రో ఆర్మ్ రెస్ట్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, రైన్ సెన్సింగ్ వైపర్స్, డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రేర్ పార్కింగ్ సెన్సర్లు, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్, బ్రేక్ వే కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. వీటితోపాటు స్టాండర్డ్ వేరియంట్లో టైర్ పంక్చర్ రిపేర్ కిట్ కూడా లభిస్తుంది.