న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: మరో ఎలక్ట్రిక్ మోడల్ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది టాటా మోటర్స్. ఎంట్రిలెవల్ మోడల్ టియాగోను ఈ నెల చివర్లో విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈవీ విభాగంలో విడుదల చేయనున్న మూడో మోడల్ ఇదని పేర్కొంది.
ఇప్పటికే నెక్సాన్, టిగోర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఐదేండ్లలో 10 ఈవీలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ అందుకుతగ్గట్టుగానే చర్యలను వేగవంతం చేసింది.